దిశ ఎఫెక్ట్.. ఎమ్మార్వో కార్యాలయ సిబ్బంది పై వేటు

by Batti.Sumithra |

ప్రతి పనికి ఓ రేటు.. కాదంటే లేటు" అంటూ దిశ పత్రికలో ప్రచురితమైన కథనానికి నల్లగొండ మండల రెవెన్యూ అధికారి (ఎమ్మార్వో) కొత్తపల్లి పరుశురాం స్పందించారు.

దిశ ఎఫెక్ట్.. ఎమ్మార్వో కార్యాలయ సిబ్బంది పై వేటు
X

దిశ, నల్లగొండ బ్యూరో: "ప్రతి పనికి ఓ రేటు.. కాదంటే లేటు" అంటూ దిశ పత్రికలో ప్రచురితమైన కథనానికి నల్లగొండ మండల రెవెన్యూ అధికారి (ఎమ్మార్వో) కొత్తపల్లి పరుశురాం స్పందించారు. మండల రెవెన్యూ కార్యాలయంలో పనిచేస్తున్న జీపీఓ నిరంజన్‌ను కలెక్టరేట్‌కు సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మండల కార్యాలయానికి వచ్చే ప్రజలతో ఎవరైనా అవినీతి, అక్రమాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాకుండా, మధ్యవర్తులు లేదా ప్రైవేట్ వ్యక్తుల ద్వారా రెవెన్యూ కార్యాలయ పనులు నిర్వహించినా సంబంధిత వారిపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కార్యాలయంలో అధికారులు చేయాల్సిన పనుల కోసం ప్రజల నుంచి ఎవరైనా డబ్బులు వసూలు చేసినా, డిమాండ్ చేసినా తనకు నేరుగా ఫిర్యాదు చేయాలని మండల ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.

Next Story