తమిళ ఇండస్ట్రీలో మైత్రి జోరు.. స్టార్ హీరోలతో వరుస ప్రాజెక్ట్స్

by Pulgam srinivas |

ధనుష్, శింబు, శివకార్తికేయన్‌లతో సినిమాలు సెట్ అయితే కోలీవుడ్‌లో మైత్రి క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

తమిళ ఇండస్ట్రీలో మైత్రి జోరు.. స్టార్ హీరోలతో వరుస ప్రాజెక్ట్స్
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినిమా పరిశ్రమలో తక్కువ సమయంలోనే అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటిగా ఎదిగిన మైత్రి మూవీ మేకర్స్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది. తెలుగులో భారీ ప్రాజెక్టులను నిర్మిస్తూ సక్సెస్ సాధిస్తున్న ఈ సంస్థ ఇప్పుడు తమిళ ఇండస్ట్రీపై కూడా ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కోలీవుడ్‌లో పలువురు స్టార్ హీరోలతో ప్రాజెక్టులను సెట్ చేసినట్లు సమాచారం. ధనుష్ హీరోగా దర్శకుడు సిరుతై శివ కాంబినేషన్‌లో ఓ మూవీని దాదాపు ఖరారు చేసినట్లు టాక్ వినిపిస్తోంది.

అలాగే శింబు - కీర్తి సురేష్ కాంబోలో మరో సినిమా, శివకార్తికేయన్ - జగన్ శక్తి కాంబినేషన్‌లో ఇంకో మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోతున్నట్లు సమాచారం. ఈ మూడు ప్రాజెక్టులు సెట్స్‌పైకి వెళ్తే తమిళ ఇండస్ట్రీలో మైత్రి మూవీ మేకర్స్‌కు మంచి క్రేజ్ రావడం ఖాయమని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ ఈ సినిమాలు మంచి విజయాలు సాధిస్తే కోలీవుడ్‌లో కూడా ఈ బ్యానర్ బలమైన స్థానం సంపాదించే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Next Story