కాంగ్రెస్‌ నాయకుడిని పరామర్శించిన మంత్రి దామోదర్‌..

by Batti.Sumithra |

ఆనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టేక్మాల్‌ మండల కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు పులి హనుమంతును రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సీ.దామోదర్‌ రాజనర్సింహ పరామర్శించారు.

కాంగ్రెస్‌ నాయకుడిని పరామర్శించిన మంత్రి దామోదర్‌..
X

దిశ, అందోల్‌ : ఆనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టేక్మాల్‌ మండల కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు పులి హనుమంతును రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సీ.దామోదర్‌ రాజనర్సింహ పరామర్శించారు. సంగారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న మంత్రి బుధవారం రాత్రి ఆసుపత్రికి వెళ్లి ఆయన ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. గత కొద్దిరోజులుగా కిడ్నీ స్టోన్స్‌తో బాధపడుతున్న హనుమంతు ఇటీవల సంగారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలని, అధైర్య పడొద్దని మంత్రి సూచించారు. హనుమంతు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాక్షించారు. ఆయన వెంట టేక్మాల్‌ సోసైటీ డైరెక్టర్‌ పులి సత్యనారాయణ ఉన్నారు.

Next Story