- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రగతి భవన్‍ను బాంబులతో పేల్చేస్తామని రేవంత్ రెడ్డి అనలేదా? కేటీఆర్
సింగరేణిలో భారీ కుంభకోణం జరుగుతోందని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. బాల్క సుమన్‍తో ములాఖత్ అయిన అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: అసలు విషయాన్ని బయటకు రాకుండా విషయాన్ని పక్కదారి పట్టించడానికే బాల్క సుమన్‍ను అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. సింగరేణిలో 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును లేనిది ఉన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. ఇంత కుంభకోణం జరుగుతుంటే ముఖ్యమంత్రి గమ్మున ఎందుకు ఉన్నారని దీనిపై నేను కిషన్ రెడ్డికి లేఖ రాస్తానన్నారు. చంచల్ గూడ జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‍ను ఇవాళ ములాఖత్ అయిన కేటీఆర్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ గతంలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ ను బాంబులతో పేల్చినా తప్పులేదని మాట్లాడారని, పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తామని బండి సంజయ్, హరీశ్ రావుపై పెట్రోల్ పోసి తగలబెడతామని మైనంపల్లి మాట్లాడారన్నారు. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోని ప్రభుత్వానికి కేవలం బాల్క సుమన్ పై ఎందుకింత కోపం అని ప్రశ్నించారు. కార్మికుల ఆవేశాన్నే బాల్క సుమన్ మాట్లాడారన్నారు.






