- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వరద కాలువ మరమ్మత్తు పనులను త్వరితగతిన పూర్తి చేయాలి
by Batti.Sumithra |
మోర్తాడ్ మండలంలోని గాండ్లపేట్ వద్ద ఉన్న వరద కాలువకు ఇటీవల గండి పడింది.

X
దిశ, మోర్తాడ్ : మోర్తాడ్ మండలంలోని గాండ్లపేట్ వద్ద ఉన్న వరద కాలువకు ఇటీవల గండి పడింది. మరమ్మత్తుల కోసం ప్రభుత్వం ఇటీవల నిధులు మంజూరు చేయగా, పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. గురువారం బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ముత్యాల సునీల్ కుమార్ మరమ్మత్తు పనులను పరిశీలించి, వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను కోరారు. రబీ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Next Story






