- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లారీని ఢీకొన్న ద్విచక్ర వాహనం.. ఒకరు మృతి
by Batti.Sumithra |
రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు.

X
దిశ, షాద్ నగర్ : రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల కథనం ప్రకారం ఫరూఖ్ నగర్ మండలం లింగారెడ్డి గూడా గ్రామ సమీపంలో పాత రహదారి పై బుధవారం రాత్రి ఆగి ఉన్న లారీని వెనక నుంచి బైక్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నందిగామ మండలం అప్పరెడ్డిగూడా గ్రామానికి చెందిన చిన్నంత్ర గారి కార్తీక్ (20) అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న షాద్ నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






