మృతి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.. ప్రముఖుల నివాళులు

by Batti.Sumithra |

ఉప్పునుంతల మండలం రాయచేడ్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, సింగిల్ విండో డైరెక్టర్ బోడ లింగమయ్య ఆకస్మికంగా మృతి చెందారు.

మృతి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.. ప్రముఖుల నివాళులు
X

దిశ, ఉప్పునుంతల : ఉప్పునుంతల మండలం రాయచేడ్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, సింగిల్ విండో డైరెక్టర్ బోడ లింగమయ్య ఆకస్మికంగా మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ వారి నివాసానికి వెళ్లి, లింగమయ్య పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అలాగే వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు కట్ట అనంతరెడ్డి, విజయ డెయిరీ చైర్మన్ దొడ్ల నరసయ్య యాదవ్, గ్రామ సర్పంచ్ భర్త ఆనంద్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story