ఆ ఒక్క యాడ్‌తోనే రమ్యకృష్ణకు టర్నింగ్ పాయింట్.. పిలిచి అవకాశం ఇచ్చిన దర్శకుడు

by Pulgam srinivas |

ప్రముఖ బిస్కెట్ యాడ్‌లో కనిపించిన రమ్యకృష్ణను వార్తాపత్రికలో చూసిన ‘వెల్లై మనసు’ మూవీ టీమ్, ఆమెను హీరోయిన్‌గా ఎంపిక చేసింది.

ఆ ఒక్క యాడ్‌తోనే రమ్యకృష్ణకు టర్నింగ్ పాయింట్.. పిలిచి అవకాశం ఇచ్చిన దర్శకుడు
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో ఎన్నో సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నటీమణుల్లో రమ్యకృష్ణ ఒకరు. ప్రస్తుతం ఈమె భారీ సంఖ్యలో సినిమాలు చేయకపోయినా, అడపాదడపా చిత్రాల్లో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఎన్నో దశాబ్దాలుగా సినీ కెరీర్‌ను విజయవంతంగా కొనసాగిస్తున్న ఈ సీనియర్ హీరోయిన్‌కు తొలి సినిమా అవకాశం మాత్రం చాలా యాదృచ్ఛికంగా వచ్చింది. మరి రమ్యకృష్ణకు మొదటి అవకాశం ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ‘వెల్లై మనసు’ సినిమాకు సంబంధించిన దర్శక నిర్మాతలు ఆ చిత్రంలోని ప్రధాన పాత్ర కోసం సరైన హీరోయిన్‌ను వెతకడం ప్రారంభించారు. చాలా రోజుల పాటు అన్వేషించినప్పటికీ వారికి ఆ పాత్రకు సరిపోయే అమ్మాయి దొరకలేదు.

ఇదే సమయంలో రమ్యకృష్ణ ఒక ప్రముఖ బిస్కెట్ ప్రకటనలో కనిపించింది. యాదృచ్ఛికంగా ఆ ప్రకటనను వార్తాపత్రికలో చూసిన ‘వెల్లై మనసు’ మూవీ టీమ్ అందులో ఉన్న రమ్యకృష్ణను చూసి తమ సినిమాలోని పాత్రకు అద్భుతంగా సరిపోతుందని భావించారు. దాంతో వెంటనే ఆమె వివరాలు తెలుసుకోవాలని మూవీ యూనిట్‌కు సూచించారు. ఎంతో కష్టపడి వెతికిన తర్వాత రమ్యకృష్ణ తమిళనాడుకు చెందిన ప్రముఖ పాత్రికేయుడు, విమర్శకుడు చో రామస్వామి మేనకోడలు అని తెలుసుకున్నారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులను సంప్రదించి ‘వెల్లై మనసు’ సినిమాలో అవకాశం ఇచ్చారు. అలా రమ్యకృష్ణ సినీ ప్రస్థానం ప్రారంభమై, అనంతరం ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి ఇండియావ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకుంది.

Next Story