అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో దారుణం.. ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రేప్

by Ajay Maddhiboyina |

ప్రముఖ పుణ్యక్షేత్రం అరుణాచలం గిరి ప్రదక్షిణదారిలో దారుణం చోటు చేసుకుంది. రెండు రోజుల్లో ఇద్దరు యువతులపై అత్యాచారం జరిగింది. ఓ ముఠా ఈ దారుణాలకు పాల్పడినట్టు గుర్తించిన పోలీసులు ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు.

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో దారుణం.. ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రేప్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ పుణ్యక్షేత్రం అరుణాచలం గిరి ప్రదక్షిణదారిలో దారుణం చోటు చేసుకుంది. రెండు రోజుల్లో ఇద్దరు యువతులపై అత్యాచారం జరిగింది. ఓ ముఠా ఈ దారుణాలకు పాల్పడినట్టు గుర్తించిన పోలీసులు ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. ఈ నెల 30న తమిళనాడులోని ధర్మపురికి చెందిన ఓ వివాహిత తన స్నేహితులతో కలిసి తిరువణ్ణామలై పౌర్ణమి గిరిప్రదక్షిణకు వచ్చింది. స్నేహితులంతా గిరి ప్రదక్షణ చేసుకుని తిరుగు ప్రయాణం అవ్వగా వివాహిత, ఆమె స్నేహితుడు వాహనం ఆపి మాట్లాడుతున్న సమయంలో ఓ ముఠా మారణాయుధాలతో వారి వద్దకు వచ్చి బెదిరింపులకు పాల్పడింది. వివాహితను అటవీప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడింది. వివాహితతో పాటు ఆమె స్నేహుతుడి దుస్తులు సైతం తీసి వారిని నగ్నంగా వీడియో తీసి అక్కడ నుండి పారపోయింది. మరుసటి రోజు నగ్నవీడియోలను వారికి పంపి లక్ష రూపాయలు పంపాలని లేదంటే వీడియోలు సోషల్ మీడియాలో పెడతామని బెదిరింపులకు పాల్పడింది. దీంతో ఆ విహాహిత రూ.4వేలు ఇచ్చి ధర్మపురి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరుసటి రోజే రాత్రి తిరువణ్ణామలై మున్సిపాలిటీ ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల యువతి గిరి ప్రదక్షిణ చేస్తుండగా కాళ్ల నొప్పులు రావడంతో అడిఅన్నామలై గ్రామం వద్ద కూర్చుని తన స్నేహితుడిని అక్కడకు రావాలని పిలిచింది. తరవాత ఇద్దరూ ఓ హోటల్ లో టిఫిన్ పార్సిల్ తీసుకుని అయ్యంపాలయం బైపాస్ రోడ్డు వద్దకు వెళ్లారు. అక్కడ ఓ ముఠా ఇద్దరినీ బెదిరించి అటవీప్రాంతానికి తీసుకెళ్లి యవతిపై అత్యాచారానికి పాల్పడింది. యువతి చెవికి ఉన్న కమ్మలు తీసుకోవడంతో పాటు వారిని నగ్నంగా వీడియో తీసి అక్కడ నుండి వెళ్లిపోయింది. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్నారు. ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఐదు బృందాలుగా విడిపోయి నిందితుల కోసం ద‌ర్యాప్తు ప్రారంభించారు. మొత్తం 11 మంది నిందితుల‌ను గుర్తించి 8మందిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన నిందితుల్లో వాసుదేవన్, ఆకాష్, అశ్వనాథశురనై, అప్పు, హరిహరన్, శర్మ, అరుణ్ కుమార్, శివగణేశన్, మరో మైనర్ బాలుడు ఉన్నారు.

Next Story