తమ్ముడిని హతమార్చిన అన్నా వదిన..

49
murder

దిశ,ఆర్మూర్ : కుటుంబ కలహాలు ఓ ప్రాణాన్ని బలిగొన్నాయి. ఆర్మూరు పట్టణంలోని కమల నెహ్రూ కాలనీలో ఉంటున్న అన్నదమ్ములు ఘర్షణకు దిగారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలై తమ్ముడు మృతి చెందినట్లు పట్టణ ఏసీపీ రఘు, సీఐ సైదేశ్వర్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. ఎరుకల సామాజిక వర్గానికి చెందిన రాజు(28) ట్రాక్టర్ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు.

బుధవారం రాత్రి అన్న శ్రీనుతో కలిసి మద్యం సేవించాడు. అనంతరం ఇరువురి మధ్య వాగ్వాదం నెలకొనగా, మాటామాట పెరిగడంతో అన్న శీను, అతని భార్య ఇద్దరు రాజుతో గొడవకు దిగారు. ఈ క్రమంలోనే అన్న వదినలు దాడి చేయగా రాజు తలకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావం కావడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న ఏసీపీ, సీఐ, ఎస్ఐ యాదగిరి గౌడ్ ఘటనా స్థలికి చేరుకుని హత్య జరిగిన తీరును పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..