ఎస్పీ కార్యాలయం ముందు యువతి ఆత్మహత్యాయత్నం

by Shyam |

<p>దిశ, మునుగోడు: మండల పరిధిలోని కల్వలపల్లి గ్రామంలో గత మూడు రోజులుగా ప్రియుడి ఇంటి ముందు దీక్ష చేస్తున్న ఓ యువతి శనివారం రాత్రి నల్లగొండ ఎస్పీ కార్యాలయం ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కల్వలపల్లి గ్రామానికి చెందిన వంటేపాక పుష్పలత అనే యువతి అదే గ్రామానికి చెందిన గంగుల వెంకన్న అనే యువకుడు గత మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. తీరా పెళ్లి విషయం వచ్చేసరికి ముఖం చాటేశాడని ఆరోపిస్తూ గత మూడు రోజులుగా వెంకన్న ఇంటి ముందు [&hellip;]</p>

ఎస్పీ కార్యాలయం ముందు యువతి ఆత్మహత్యాయత్నం
X

దిశ, మునుగోడు: మండల పరిధిలోని కల్వలపల్లి గ్రామంలో గత మూడు రోజులుగా ప్రియుడి ఇంటి ముందు దీక్ష చేస్తున్న ఓ యువతి శనివారం రాత్రి నల్లగొండ ఎస్పీ కార్యాలయం ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కల్వలపల్లి గ్రామానికి చెందిన వంటేపాక పుష్పలత అనే యువతి అదే గ్రామానికి చెందిన గంగుల వెంకన్న అనే యువకుడు గత మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. తీరా పెళ్లి విషయం వచ్చేసరికి ముఖం చాటేశాడని ఆరోపిస్తూ గత మూడు రోజులుగా వెంకన్న ఇంటి ముందు దీక్ష చేస్తోంది. శనివారం సాయంత్రం ఎస్పీ కార్యాలయంలో యువతి విషం తీసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించింది. దీంతో నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Next Story