బడికి వెళ్లిన బాలుడిని లాడ్జికి తీసుకెళ్లిన యువతి.. వీడియోతీసి చివరకు

683
Rape attempt

దిశ, వెబ్‌డెస్క్ : భాగ్యనగరంలో దారుణం చోటు చేసుకుంది. పాఠశాలకు వెళ్లిన బాలుడిని లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారం చేసింది ఓ యువతి. ఈ ఘటన నగరంలోని జూబ్లీహిల్స్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. 9వ తరగతి చదువుతున్న బాలుడి కుటుంబం జూబ్లీహిల్స్ ‌లో నివాసం ఉంటున్నారు. అయితే కొన్నిరోజుల క్రితమే టోలీచౌకి నుంచి జూబ్లీహిల్స్‌కు మారారు. ఈ క్రమంలో వారి ఇంట్లో ఉన్న 20 తులాల బంగారం, డబ్బు కనిపించకుండా పోయింది. అయితే తన కొడకు ప్రవర్తనలో తేడాను గమనించిన తల్లి, బంగారం విషయం‌పై బాలుడిని ప్రశ్నించింది. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాలుడు చెప్పిన నిజం విన్న తల్లి షాక్‌కు గురైంది.

అసలేం జరిగిందంటే..

ఓ యువతి మాజీ ప్రియుడి దగ్గరి బంధువైన తొమ్మిదో తరగతి బాలుడిని వలలో వేసుకుంది. అయితే ఒక రోజు పాఠశాలకు వెళ్లిన బాలుడిని లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారం చేసింది. అంతటితో ఆగకుండా మాజీ ప్రియుడితో దాన్ని వీడియో తీయించి బాలుడిని బెదిరించడం మొదలు పెట్టింది. దీంతో భయపడిన బాలుడు ఇంట్లో ఉన్న బంగారాన్ని యువతికి ఇచ్చేశాడు. ఈ విషయాన్ని బాలుడి తల్లికి చెప్పడంతో బాలుడి తల్లి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా తన కుమారుడిపై మూడు సార్లు అఘాయిత్యానికి పాల్పడిన నిందితురాలిని కఠినంగా శిక్షించాలని బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు.కాగా, ఈ ఘటన మూడేళ్ల క్రితం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించిన పోలీసులు నిందితురాలిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కారులో మహిళా కార్యకర్తను వివస్త్రను చేసి.. వీడియోలు తీసిన అధికార పార్టీ నేత అరెస్ట్