- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యువతిపై యువకుడి అత్యాచారం.. అది లేకపోవడంతోనే..
<p>దిశ, ఏపీ బ్యూరో: ప్రకాశం జిల్లా కురిచేడు మండలం ఆవులమందలో దారుణం జరిగింది. బహిర్భూమికి వెళ్లిన ఓ యువతిని ఇద్దరు యువకులు కిడ్నాప్ చేసి, బైక్‌పై నిర్మానుష్య ప్రాంతానికి ఎత్తుకెళ్లారు. ఆ ఇద్దరు యువకుల్లో ఒకరు యువతిపై అత్యాచారానికి పాల్పడగా మరో యువకుడు సహకరించాడు. అనంతరం యువతిని అక్కడ వదిలేసి పరారయ్యారు. అనంతరం ఇంటికి చేరుకున్న బాధితురాలు తల్లిదండ్రులకు జరిగిన ఘోరాన్ని చెప్పి బోరున విలపించింది. తల్లిదండ్రుల సహకారంతో బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: ప్రకాశం జిల్లా కురిచేడు మండలం ఆవులమందలో దారుణం జరిగింది. బహిర్భూమికి వెళ్లిన ఓ యువతిని ఇద్దరు యువకులు కిడ్నాప్ చేసి, బైక్‌పై నిర్మానుష్య ప్రాంతానికి ఎత్తుకెళ్లారు. ఆ ఇద్దరు యువకుల్లో ఒకరు యువతిపై అత్యాచారానికి పాల్పడగా మరో యువకుడు సహకరించాడు. అనంతరం యువతిని అక్కడ వదిలేసి పరారయ్యారు. అనంతరం ఇంటికి చేరుకున్న బాధితురాలు తల్లిదండ్రులకు జరిగిన ఘోరాన్ని చెప్పి బోరున విలపించింది. తల్లిదండ్రుల సహకారంతో బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. అయితే బాధితురాలి కుటుంబం ఓ ఇంట్లో అద్దెకు ఉంటుంది. అయితే ఆ ఇంట్లో బాత్‌రూమ్ లేకపోవడంతో రోజూ బహిర్భూమికి వెళ్తుంది. ఈ విషయాన్ని గమనించిన కామాంధులు బుధవారం కాపుకాసి ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story






