- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బతుకమ్మ ఆడుతుండగా అలా చేసిన యువకులు.. చితకబాదిన మహిళలు
<p>దిశ, గోదావరిఖని: సద్దుల బతుకమ్మ సందర్భంగా మహిళలందరూ ఆటపాటలతో ఆనందంగా బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్న క్రమంలో ఒక్కసారిగా సినీఫక్కీలో జరిగిన ఘటన అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. బుల్లెట్ బండిపై వచ్చి చైన్ స్నాచింగ్ కు ప్రయత్నించిన ఓ ఇద్దరు యువకులకు మహిళలు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన సంఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పవర్ హౌస్ కాలనీలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే… పవర్ హౌస్ కాలనీలో స్థానిక మహిళలు బతుకమ్మ ఆడుతున్న […]</p>

దిశ, గోదావరిఖని: సద్దుల బతుకమ్మ సందర్భంగా మహిళలందరూ ఆటపాటలతో ఆనందంగా బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్న క్రమంలో ఒక్కసారిగా సినీఫక్కీలో జరిగిన ఘటన అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. బుల్లెట్ బండిపై వచ్చి చైన్ స్నాచింగ్ కు ప్రయత్నించిన ఓ ఇద్దరు యువకులకు మహిళలు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన సంఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పవర్ హౌస్ కాలనీలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే… పవర్ హౌస్ కాలనీలో స్థానిక మహిళలు బతుకమ్మ ఆడుతున్న క్రమంలో ఓ ఇద్దరు యువకులు బుల్లెట్ బండిపై వచ్చి బతుకమ్మ ఆడుతున్న మహిళలు దగ్గర ఏలేశ్వరం లావణ్య అనే వివాహిత మెడలో ఉన్న మూడు తులాల బంగారు గొలుసును లాక్కొని వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా ఆ వివాహిత కిందపడిపోయింది. దీంతో అక్కడే ఉన్న స్థానికులు వెంబడించి సదరు యువకులను పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అయితే ఇదంతా అక్కడ స్థానికంగా ఉన్న కొంతమంది వీడియో తీస్తున్న క్రమంలో ఈ దృశ్యాలు రికార్డ్ కావడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.






