- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాశ్మీర్ టు కన్యాకుమారి.. వయా చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్
<p>దిశ, చార్మినార్: 75 రోజుల్లో కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు (3500 కిలోమీటర్లు) పాదయాత్రకు బాలాపూర్‌కు చెందిన 22 ఏళ్ల యువకుడు ముచింతల సాయి రాజ్వంశీకర్ శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు 51 రోజుల పాదయాత్రలో 2400 కిలోమీటర్ల మైలురాయిని దాటాడు. ఈ క్రమంలో శనివారం చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి దేవాలయాన్ని సందర్శించి.. అమ్మవారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాన్ని సందర్శించిన ముచింతల సాయిరాజ్వంశీకర్‌ను ఆలయ ట్రస్ట్ చైర్ పర్సన్ […]</p>

దిశ, చార్మినార్: 75 రోజుల్లో కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు (3500 కిలోమీటర్లు) పాదయాత్రకు బాలాపూర్‌కు చెందిన 22 ఏళ్ల యువకుడు ముచింతల సాయి రాజ్వంశీకర్ శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు 51 రోజుల పాదయాత్రలో 2400 కిలోమీటర్ల మైలురాయిని దాటాడు. ఈ క్రమంలో శనివారం చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి దేవాలయాన్ని సందర్శించి.. అమ్మవారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాన్ని సందర్శించిన ముచింతల సాయిరాజ్వంశీకర్‌ను ఆలయ ట్రస్ట్ చైర్ పర్సన్ శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.

కాగా, గతంలో ఓ మహిళ 85 రోజుల్లో కాశ్మీర్ టు కన్యాకుమారి పాదయాత్ర చేసి రికార్డు సృష్టించింది. ఆ రికార్డును బ్రేక్ చేయడానికి సాయి రాజ్వంశీకర్ ఈ సాహసోపేత నిర్ణయం తీసుకున్నాడు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 75 రోజుల్లో కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు 3500 కిలోమీటర్ల పాదయాత్రకు గత సెప్టెంబర్16వ తేదీన శ్రీకారం చుట్టాడు. ఇప్పటి వరకు 2400 కిలోమీటర్ల దూరాన్ని 51 రోజుల్లో విజయవంతంగా పూర్తి చేశాడు. 14 రోజుల్లో కన్యాకుమారికి చేరుకోవాల్సి ఉండగా చార్మినార్ నుంచి బయలుదేరాడు. బీబీఎం చదివిన పర్వతారోహకుడు ముచింతల సాయిరాజ్వంశీకర్ రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌కు చెందిన పద్మావతి, సుధాకర్ దంపతుల కుమారుడు.







