షాకింగ్.. ప్రయాణికులతో వెళ్తున్న బస్సుకు నిప్పంటించిన యువకుడు..

119
Fire Accident in kukatpally

దిశ, వెబ్‌డెస్క్ : ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గురువారం ఉదయం ప్రయాణికుతో వెళ్తున్న బస్సుపై పెట్రోల్ పోసి ఓ యువకుడు నిప్పంటించాడు. వివరాల ప్రకారం.. జిల్లాలోని కనిగిరిలో వెలిగండ్ల మండలం మొగులూరుకు చెందిన రామగిరి ఏడుకొండలు అనే యువకుడు.. ఆగి ఉన్న బస్సుపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అది గమనించిన వెంటనే అప్రమత్తమై వెంటనే మంటలను ఆర్పారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

బస్సులో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. వెంటనే ఈ దారుణానికి ఒడిగట్టిన యువకుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే విచారణ సందర్భంగా సదరు యువకుడికి మానసిక స్థితి సరిగ్గా లేదని పోలీసులు గుర్తించినట్టు తెలిపారు.

 

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..