- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోలీసుల తీరుపై ప్రజల ఆగ్రహం
<p>దిశ, కరీంనగర్: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల వద్ద రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, బైక్ ఢీ కొని యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే 108 వాహనానికి సమాచారం అందించారు. కాగా ఈ అంబులెన్సు కోసం దాదాపు అరగంటకు పైగా ఎదురుచూసిన వాహనం రాకపోయేసరికి పోలీసులకు సమాచారం అందజేశారు. తీరా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రోడ్డుపై తీవ్ర గాయాలతో పడి ఉన్నవ్యక్తిని వదిలేసి, కారు నడిపిన వ్యక్తిని పోలీసు […]</p>

X
దిశ, కరీంనగర్: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల వద్ద రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, బైక్ ఢీ కొని యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే 108 వాహనానికి సమాచారం అందించారు. కాగా ఈ అంబులెన్సు కోసం దాదాపు అరగంటకు పైగా ఎదురుచూసిన వాహనం రాకపోయేసరికి పోలీసులకు సమాచారం అందజేశారు.
తీరా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రోడ్డుపై తీవ్ర గాయాలతో పడి ఉన్నవ్యక్తిని వదిలేసి, కారు నడిపిన వ్యక్తిని పోలీసు వాహనంలో తరలించారు. దీంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాకుండా ఇదేంటని అడిగిన వారిపై దాడి చేయడంతో, వారు రోడ్డుపై బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో కాసేపు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
Next Story






