50 రూపాయల కోసం యువకుడ్ని చంపేశారు

by Vemula.Srinu Prasad |   (  Updated:2021-01-20 22:41:38  IST  )

<p>దిశ,వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో 50రూపాయలు యువకుడి ప్రాణం తీశాయి. పాలడెయిరీలో రూ.50 అప్పు విషయంలో వివాదం తలెత్తింది. ఈ వివాదంలో పాలడెయిరీ ఉద్యోగి బాజీ అనే యువకుడిపై నిందితులు దాడి చేశారు. ఈ దాడిలో నిందితులు బాధితుడిపై పిడిగుద్దులు గుద్దడంతో బాజి కుప్పకూలి కిందపడిపోయాడు. దీంతో అప్రమత్తమైన స్థానికులు అత్యవసర చికిత్స కోసం బాధితుణ్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.</p>

50 రూపాయల కోసం యువకుడ్ని చంపేశారు
X

దిశ,వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో 50రూపాయలు యువకుడి ప్రాణం తీశాయి. పాలడెయిరీలో రూ.50 అప్పు విషయంలో వివాదం తలెత్తింది. ఈ వివాదంలో పాలడెయిరీ ఉద్యోగి బాజీ అనే యువకుడిపై నిందితులు దాడి చేశారు. ఈ దాడిలో నిందితులు బాధితుడిపై పిడిగుద్దులు గుద్దడంతో బాజి కుప్పకూలి కిందపడిపోయాడు. దీంతో అప్రమత్తమైన స్థానికులు అత్యవసర చికిత్స కోసం బాధితుణ్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Next Story