ప్రైవేట్ స్కూల్లో ఉరేసుకున్న యువకుడు

71

దిశ, వెబ్‌డెస్క్: తండ్రి మందలింపుతో మనస్థాపానికి గురైన కొడుకు ప్రాణం తీసుకున్నాడు. తల్లిదండ్రులను తీరని విషాదంలో నెట్టేశాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాట పట్టణ కేంద్రం శ్రీనివాస‌నగర్‌లో వెలుగుచూసింది. మంగళవారం రాత్రి తండ్రి మందలించాడని ఇంటి నుంచి బయటకు వెళ్లిన మురళీ ఎంతకీ తిరిగి రాలేదు. దీంతో అతడి కోసం గాలింపు చేపట్టారు. పక్కనే ఉన్న ప్రైవేట్ పాఠశాలలో ఉన్నాడేమో అన్న సందేహంతో వెళ్లి చూడగా విగతాజీవిగా కనిపించాడు. స్కూల్‌ తరగతి గదిలో మురళీ ఉరేసుకున్నాడు. దీంతో బాధిత కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమ్మిత్తం కోదాడ పట్టణ ఆస్పత్రికి తరలించారు. అయితే, స్కూల్లోకి వెళ్లి ఎలా ఊరేసుకున్నాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.