- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రతి ఒక్కడు దొంగే.. మంచోడికి చోటులేదంటూ పూరి జగన్నాథ్ సంచలన ట్వీట్.. ఎవరిని ఉద్దేశించంటే?
పూరి జగన్నాథ్.. ప్రతి ఒక్కడు దొంగ బట్టేరా.. మంచోడికి చోటు లేదురా’’ అంటూ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

దిశ, సినిమా: డేర్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, టాలీవుడ్ హీరోయిన్ చార్మీ కౌర్ స్టార్ట్ చేసిన బ్యానర్ ‘పూరి కనెక్ట్స్’ నుంచి వస్తున్న ‘స్లమ్‌డాగ్-33’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం విజయ్ సేతుపతి అబిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతికి జోడీగా సంయుక్త మీనన్ నటిస్తుండగా.. టబు, విజయ్ కుమార్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుండగా.. అప్డేట్స్ కోసం అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలో.. తాజాగా, పూరి కనెక్ట్స్ బ్యానర్ నుంచి అప్డేట్ కాకుండా.. ఒక క్రిప్టిక్ పోస్ట్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సాధారణంగా సినిమా ప్రమోషన్లు, టీజర్, పోస్టర్ల కోసం లేదా షూటింగ్ అప్డేట్స్ కోసం మాత్రమే షేర్ చేస్తుంటారు.
కానీ సడెన్‌గా పూరి జగన్నాథ్.. ప్రతి ఒక్కడు దొంగ బట్టేరా.. మంచోడికి చోటు లేదురా’’ అంటూ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాకుండా సీరియస్‌నెస్ తెలియజేసే ఎమోజీలు, డిసప్పాయింట్‌ని సూచించే సింబల్స్ కూడా పెట్టడం చర్చకు దారితీస్తోంది. అయితే ఈ పోస్ట్ పూరి ఎవరిని ఉద్దేశించి పెట్టాడా? అని అప్పుడే పలు రకాల చర్చలు మొదలెట్టేశారు నెటిజన్లు. దీనిని పూరి ఎదుర్కొంటున్న ఏదైనా ఇన్సిడెంట్ గురించి లేదా బిజినెస్ వివాదాల వల్ల కలిగిన అసంతృప్తిని ఇలా ఇండైరెక్ట్‌గా తెలియజేశాడని అంటున్నారు. మరికొందరు మాత్రం.. లైగర్, డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమాల డిస్ట్రిబ్యూటర్లతో ఉన్న కొన్ని ఫైనాన్షియల్ వివాదాల నేపథ్యంలో వచ్చిన ఆవేదన కావచ్చని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి పూరి జగన్నాథ్ పెట్టిన ఈ పోస్ట్ నెట్టింట దుమారం రేపుతోంది.






