- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mulugu Forests: ములుగు జిల్లాలోనే దట్టమైన అడవులు.. మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు
రాష్ట్రంలో ములుగు జిల్లాలోనే దట్టమైన అటవీ ప్రాంతాలు ఉన్నాయని, పచ్చని జిల్లాగా మార్చడానికి ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తి పై ఉందని మంత్రి డాక్టర్ దనసరి అనసూయ(సీతక్క) అన్నారు.

దిశ, ములుగు జిల్లా ప్రతినిధి: రాష్ట్రంలో ములుగు జిల్లాలోనే దట్టమైన అటవీ ప్రాంతాలు ఉన్నాయని, పచ్చని జిల్లాగా మార్చడానికి ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తి పై ఉందని మంత్రి డాక్టర్ దనసరి అనసూయ(సీతక్క) అన్నారు. చెట్లతోనే మానవ మనుగడ కొనసాగుతుందని, ప్రకృతి, పచ్చదనం ప్రాణవాయువు అని తెలిపారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని శుక్రవారం ములుగు మండలం ఇంచర్ల ఏకో పార్క్‌లో కాలేశ్వరం జోన్ ముఖ్య అటవీ సంరక్షణాధికారి బి.ప్రభాకర్, కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుదీర్ రామ్నాథ్ కేకన్, జిల్లా అటవీశాఖ అధికారి వికాస్ మీనా, ఐటీడీఏ పీవో లెనిన్ ఉత్సల్ టోప్పో లతో కలిసి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ.. పచ్చని చెట్లను చూస్తే ప్రతి ఒక్కరికి ఆనందం కలుగుతుందని, పలు రకాల చెట్లు మానవునికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని వివరించారు. కొందరు తమ స్వార్థం కోసం విచ్చలవిడిగా చెట్లు నరకడం వలన దట్టమైన అటవీ ప్రాంతాలు ఎడారి ప్రాంతాలుగా మారి మానవ మనుగడకే ముప్పు ఏర్పడబోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ములుగు నియోజకవర్గంలో 77 శాతం, జిల్లాలో 64 శాతం అటవీ ప్రాంతాలు ఉన్నాయని, అడవులు ఉండటం వలన కలిగే లాభాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ములుగు జిల్లా ఇప్పటికే పర్యాటక ప్రాంతంగా వెలిగిపోతోందని, ఇక్కడి ప్రాంతంలో దట్టమైన అడవులతో పాటు దేవాలయాలు, సరస్సులు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని తెలిపారు.
సంబంధిత శాఖ అధికారులు గ్రామ సర్పంచులతో సమన్వయం చేసుకుని అడవులను కాపాడుకోవాలని, అవసరమైన పక్షంలో గతంలో మాదిరిగా అటవీ సంరక్షణ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రస్తుత వర్షాకాలంలో అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు రోడ్లకు సమీపంలో కాకుండా కొంత దూరంలో మొక్కలు నాటాలని అన్నారు. ఇప్పపు చెట్లతో ఎన్నో లాభాలు ఉన్నాయని ఇప్పటికే లడ్డు తయారు చేస్తున్నారని, ఇప్ప పువ్వు తో చేసిన మద్యానికి ఇతర రాష్ట్రాల్లో లక్షల రూపాయల విలువ ఉందని, ఇప్పప్పుతో చేసిన తినుబండారాలను తీసుకుంటే ప్రతి ఒక్కరికి విటమిన్ సి తో పాటు ఎర్ర రక్త కణాలు పెరుగుతాయని తెలిపారు. రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించి చెట్లను పెంచాలని తెలిపారు. అనంతరం అటవీ శాఖ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను సందర్శించి, అటవీ సంపద సంరక్షణ, జీవ వైవిధ్యం పరిరక్షణ, జీవ వైవిధ్యం పరిరక్షణ, వన్యప్రాణుల రక్షణకు సంబంధించిన చిత్రాలను పరిశీలించారు. కార్యక్రమంలో పంచాయతీ రాజ్ డైరెక్టర్ బైరెడ్డి భగవాన్ రెడ్డి, ఇంచర్ల సర్పంచ్ కుమార్ గౌడ్, స్థానిక ప్రజాప్రతినిధులు, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.






