బిగ్ బ్రేకింగ్.. అన్నామలై రాజీనామాకు బీజేపీ ఆమోదం

by Malleboina Mahesh |   (  Updated:2026-06-05 05:27:11  IST  )

తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై రాజీనామాకు బీజేపీ అధిష్టానం ఆమోదం. మధ్యాహ్నం 12 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్న అన్నామలై.

బిగ్ బ్రేకింగ్.. అన్నామలై రాజీనామాకు బీజేపీ ఆమోదం
X

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం తమిళనాడు బీజేపీకి మాజీ అధ్యక్షుడు అన్నామలై (Annamalai) రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని బీజేపీ పెద్దలతో చర్చించిన అనంతరం ఆయన ఐదు పేజీల రాజీనామా (resignation) లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌కు అందజేశారు. కాగా అన్నామలై తో మరోసారి చర్చించిన బీజేపీ అధిష్టానం.. తన నిర్ణయం మార్చుకోక పోవడంతో శుక్రవారం ఉదయం ఆయన రాజీనామాకు ఆమోదం తెలిపింది. ఇదిలా ఉంటే ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు అన్నామలై ప్రెస్ మీట్ పెట్టనున్నట్లు ప్రకటించారు.

రాజకీయ భవిష్యత్తుపై ఉత్కంఠ - మధ్యాహ్నం ప్రెస్ మీట్

తమిళనాడులో బీజేపీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించిన అన్నామలై, ఇలా హఠాత్తుగా పార్టీకి దూరం కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఆయన ఈ రోజు (శుక్రవారం) మధ్యాహ్నం 12 గంటలకు మీడియా సమావేశం (Press Meet) నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ ప్రెస్ మీట్‌లో అన్నామలై తన రాజీనామాకు గల అసలు కారణాలను వెల్లడించడంతో పాటు, తన భవిష్యత్ రాజకీయ కార్యాచరణను కూడా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఆయన కొత్త పార్టీ పెడతారా? లేక మరేదైనా కీలక నిర్ణయం తీసుకుంటారా? అనే అంశంపై దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.



Next Story