- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అన్నామలై సంచలన నిర్ణయం.. కొత్త పార్టీ ప్రకటన
బీజేపీకి రాజీనామా చేసిన అన్నామలై కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. గత 18 నెలలుగా పార్టీతో విభేదాలు ఉన్నాయని, తమ కొత్త పార్టీ 2031 తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన అన్నామలై కొత్త రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించారు. ఈ రోజు ఉదయం ఆయన రాజీనామాకు బీజేపీ ఆమోదం తెలపగా..మధ్యాహ్నం 12 గంటలకు అన్నామలై మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా.. పార్టీ కోసం తాను ఎంతో కష్టపడ్డానని తెలిపారు. తమిళనాడులో బీజేపీ ఒంటరిగా పోటీ చేయాలని తాను ఎంతో ప్రయత్నించానని, కానీ అది సాధ్యం కాలేదని తెలిపారు. "నేను బీజేపీ వ్యక్తినా లేక తమిళుడినా అనే దానిపై పెద్ద సంఘర్షణ జరిగింది. నేను రాజీనామా చేయబోతున్నానని 2025 డిసెంబర్ 4న పార్టీకి చెప్పాను. ఎన్నికలు పూర్తి చేసి ఆ తర్వాత వెళ్ళమని పార్టీ నన్ను కోరింది.
గత 18 నెలలుగా పార్టీతో తనకు విభేదాలు ఏర్పడ్డాయని, తాను బీజేపీకీ భారంగా ఉండాలనుకోవడం లేదని, అందుకే పార్టీకి రాజీనామా చేసినట్లు ఈ సందర్భంగా అన్నామలై ప్రకటించారు. అలాగే తనతో పాటు ఇన్ని రోజులు నడిచిన ప్రతి ఒక్కరికి అన్నామలై ధన్యవాదాలు తెలిపారు. అలాగే త్వరలోనే కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నామని, 2031 అసెంబ్లీ ఎన్నికల్లో తమ కొత్త పార్టీ పోటీ చేస్తుందని, పార్టీకి సంబంధించిన అన్ని వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని ఈ సందర్భంగా అన్నామలై చెప్పుకొచ్చారు.






