దొంగలు.. బాబోయ్.. వేంసూరు, పెనుబల్లిలో వరుస దొంగతనాలతో భయాందోళనలో ప్రజలు

by Jakkula.Mamatha |

ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కేజీ మల్లెల గ్రామంలో చోరీ ఘటన కలకలం రేపుతోంది.

దొంగలు.. బాబోయ్.. వేంసూరు, పెనుబల్లిలో వరుస దొంగతనాలతో భయాందోళనలో ప్రజలు
X

దిశ,సత్తుపల్లి: ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కేజీ మల్లెల గ్రామంలో చోరీ ఘటన కలకలం రేపుతోంది. గురువారం అర్ధరాత్రి గ్రామంలోని రవికుమార్ అనే రైతు ఇంటి తలుపు వేసి ఇంటి ముందు పడుకున్నారు. ఆ సమయంలో గుర్తు తెలియని దుండగులు చాకచక్యంగా తలుపులు తెరిచి బెడ్ రూమ్ లోనీ పరుపు కింద దాచిన తాళాలతో బీరువాలోని 100 గ్రాముల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. అదే ఇంట్లో మరో బెడ్ రూమ్‌లో రోజు వేసుకునే బంగారు ఆభరణాలను పడుకునే ముందు మెడలో నుంచి తీసి మంచం పై ఉన్న పరుపు కింద దాచిన నగలు కూడా దుండగులు ఎత్తుకెళ్లారు. తెల్లవారిన తర్వాత ఇంట్లో వాళ్ళు మంచం కింద దాచిన నగలు కనపడకపోవడంతో బీరువా తాళాలు ఓపెన్ చేసి చూడగా బీరువాలో దాచిన బంగారం కూడా కనిపించలేదు.

ఇంట్లో ఉండగానే రాత్రి దొంగలు పడ్డారని ఆందోళనతో పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వేంసూరు మండలంలో వరుసగా ఒకే రోజు చోరీలు జరగడం గ్రామస్తులను భయాందోళనకు గురిచేస్తోంది. ఇంట్లో మేము నిద్రిస్తుండగానే మాకు మెలుకువ రాకుండా దొంగలు భారీ ఎత్తున బంగారం ఆభరణాలు దోచుకెళ్లిన తీరు చూస్తే భయమేస్తుందని, తమకు మెలుకువ రాకుండా ఏమైనా మత్తు పెట్టారేమో.. అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సుమారు 18 లక్షల విలువైన బంగారం పోవడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. వేసవి కాలం కావడంతో ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న సమయంలో దొంగలు చోరీకి పాల్పడుతున్నారని, ఏక కాలంలో పక్క పక్క మండలాల్లో వరుస చోరీలు జరిగిన తీరు చూస్తే అంతర్ రాష్ట్ర దొంగల ముఠా పని అయ్యుండొచ్చని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Next Story