- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శ్రీకాకుళంలో దారుణం.. మద్యం మత్తులో ఉన్న భర్తను దాడి చేసి చంపిన భార్య
by Ajay Maddhiboyina |
శ్రీకాకుళం పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న భర్తను భార్య కత్తిపీటతో దాడి చేసి హతమార్చింది. పట్టణంలోని ప్రకాష్ నగర్ కు చెందిన అసిరినాయుడు, జయలక్ష్మి భార్య భర్తలు.

X
దిశ, వెబ్ డెస్క్: శ్రీకాకుళం పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న భర్తను భార్య కత్తిపీటతో దాడి చేసి హతమార్చింది. పట్టణంలోని ప్రకాష్ నగర్ కు చెందిన అసిరినాయుడు, జయలక్ష్మి భార్య భర్తలు. గురువారం రాత్రి భర్త మద్యం తాగి రాగా ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ఈ క్రమంలో వివాదం పెరిగి పెద్దది కాగా జయలక్ష్మి అక్కడే ఉన్న కత్తిపీటతో తన భర్తపై దాడి చేసింది. తీవ్రగాయాలు కావడంతో అసిరినాయుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పట్టణం నడిఒడ్డున జరిగిన ఈ హత్య కలకలం రేపింది. భర్తను హత్య చేసిన జయలక్ష్మిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన వివరాల ప్రకారం కేసు నమోదు చేసుకున్నారు. క్షణికావేశంలోనే జయలక్ష్మి భర్తను హత్య చేసిందా లేదా ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
Next Story






