ఆ సినిమా నాకు చాలా స్పెషల్.. దానివల్లే ఎనలేని గుర్తింపు వచ్చింది: దుషారా విజయన్

by Mallepaka Hamsa |

అలాగే తన కెరీర్‌లో ‘సర్పత్త పరంబరై’ సినిమా అత్యంత ముఖ్యమైనదని దుషారా గుర్తుచేసుకుంది.

ఆ సినిమా నాకు చాలా స్పెషల్.. దానివల్లే ఎనలేని గుర్తింపు వచ్చింది: దుషారా విజయన్
X

దిశ, సినిమా: కోలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ దుషారా విజయన్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో సౌత్ ఇండస్ట్రీలో దూసుకుపోతోంది. ఇటీవల ‘వీర ధీర సూరన్’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఈ భామ, ఇప్పుడు ‘ఎక్జామ్’ అనే వెబ్ సిరీస్ డిజిటల్ ప్రపంచంలోకి కూడా అడుగుపెట్టింది. అలాగే ‘‘కట్టలాన్’ అనే సినిమాతో మలయాళ చిత్ర పరిశ్రమలోకి కూడా అద్భుతమైన ఎంట్రీ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో క్రేజీ తమిళ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. వైవిధ్యభరిత నటుడు మాధవన్‌తో కలిసి ‘G.D. నాయుడు’ బయోపిక్‌లో నటిస్తోంది. అలాగే యాక్షన్ హీరో విశాల్ సరసన ‘మకుటం’ సినిమాలో, ప్రముఖ దర్శకుడు పా. రంజిత్ కాంబినేషన్‌లో రాబోతున్న ‘సర్పత్త పరంబరై రౌండ్-2’ లోనూ నటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. నీలం ప్రొడక్షన్స్, లెర్న్ అండ్ టీచ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సంయుక్తంగా తెరకెక్కుతోంది. ఈ మూవీ 2023లో డైరెక్ట్ ఓటీటీలోకి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ‘సర్పత్త పరంబరై’ కి సీక్వెల్‌గా రాబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఆర్య హీరోగా చేస్తున్నారు.

తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దుషారా ఈ సినిమా విశేషాలు పంచుకుంది. మలయాళ చిత్ర పరిశ్రమ తనను ఎంతగానో ఆకట్టుకుందని దుషారా తెలిపింది. అక్కడి వాతావరణం చాలా సరళంగా ఉంటుందని పేర్కొంది. ప్రస్తుతానికి తనకు మలయాళ భాష అర్థమవుతుందని, కానీ అనర్గళంగా మాట్లాడటానికి కొంత సమయం పడుతుందని చెప్పింది. భవిష్యత్తులో అక్కడ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసేటప్పుడు, తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకోవాలని బలంగా ఆశపడుతోంది. అలాగే తన కెరీర్‌లో ‘సర్పత్త పరంబరై’ సినిమా అత్యంత ముఖ్యమైనదని దుషారా గుర్తుచేసుకుంది. ఇందులో తాను పోషించిన మరియమ్మ పాత్ర తనకు ఎనలేని గుర్తింపు తెచ్చిపెట్టిందని సంతోషం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ సినిమా రెండో భాగం కోసం ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోందని ఈ యంగ్ బ్యూటీ స్పష్టం చేసింది.

Next Story