గాంధీ ఆస్పత్రిలో మరో రెండు ఎబోలా అనుమానిత కేసులు

by Jakkula.Mamatha |   (  Updated:2026-06-05 07:44:00  IST  )

నగరంలో ఎబోలా వైరస్ అనుమానిత కేసులు కలకలం రేపుతున్నాయి.

గాంధీ ఆస్పత్రిలో మరో రెండు ఎబోలా అనుమానిత కేసులు
X

దిశ, సికింద్రాబాద్: నగరంలో ఎబోలా వైరస్ అనుమానిత కేసులు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఒక వ్యక్తితో పాటు మరో ఇద్దరిని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ముగ్గురు ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. వీరంతా విదేశాల నుంచి ఒకే విమానంలో హైదరాబాద్‌కు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. అనుమానితుల రక్త నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ప్రయోగశాలకు పంపించగా, ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. అలాగే వారితో కలిసి ప్రయాణించిన ఇతర ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితులపై కూడా ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. ఎబోలా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు.

Next Story