- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం న్యాయమా.. పవన్ కామెంట్స్‌పై కేఏ పాల్ ఫైర్
తెలంగాణలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ స్పందించారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాలలో దుమారం రేపుతున్నాయని అన్నారు. పవన్ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం న్యాయమా అని ప్రశ్నించారు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ స్పందించారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాలలో దుమారం రేపుతున్నాయని అన్నారు. పవన్ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం న్యాయమా అని ప్రశ్నించారు. ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చమని ప్రజలు నిలదీస్తుంటే, అవి మానేసి ఈ గొడవలు ఎందుకు అని ప్రశ్నించారు. జూన్ 14న తాను హ్యూస్టన్ లో పెద్ద సభ పెడుతున్నానని ఆ సభకు రావాలని పవన్ ను ఆహ్వానించారు. ఇదిలా ఉంటే పవన్ కల్యాణ్ ఇటీవల తెలంగాణలో మీడియా సమావేశం నిర్వహించిన సంగతె తెలిసిందే.
సమావేశంలో తమ పార్టీ తెలంగాణలో కూడా పోటీ చేస్తుందని అన్నారు. తెలంగాణలో త్వరలోనే తానే తిరుగుతానని స్పష్టం చేశారు. అంతేకాకుండా తనను తెలంగాణలో అడుగుపెట్టనివ్వం అని అంటున్నారని, తెలంగాణ మీ జాగీరా అని ప్రశ్నించారు. పవన్ మీడియా సమావేశం తరవాత తెలంగాణలోని నాయకులు ఆయనకు కౌంటర్లు ఇస్తూ మీడియా సమావేశాలు ఏర్పాటు చేశారు. బీజేపీ మాత్రం పవన్ కు సపోర్ట్ చేయగా, మిగితా పార్టీలు ఆయన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్నాయి. దీంతో రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకోబోతున్నాయనే ప్రచారం జరుగుతోంది.






