కృంగిన బ్రిడ్జి.. పొంచి ఉన్న ప్రమాదం

by Kodari Anjali |

ఆళ్లపల్లి మండల పరిధిలోని పెద్ద వెంకటాపురం గ్రామపంచాయతీకి వెళ్లే రహదారి, బ్రిడ్జి కృంగిపోయినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కృంగిన బ్రిడ్జి.. పొంచి ఉన్న ప్రమాదం
X

దిశ, ఆళ్లపల్లి: ఆళ్లపల్లి మండల పరిధిలోని పెద్ద వెంకటాపురం గ్రామపంచాయతీకి వెళ్లే రహదారి, లక్ష్మిపురం గ్రామ శివారులో బ్రిడ్జి కృంగింది. గత సంవత్సరం కురిసిన భారీ వర్షాలకు బ్రిడ్జి కృంగింది. ఆ గ్రామాలకు వెళ్లే ప్రయాణికులు కృంగిన బ్రిడ్జి పైనుంచి భయం భయంగా ప్రయాణిస్తున్నారు. వర్షాకాలం మొదలవుతుందని భారీ వర్షాలకు వరద ప్రవాహంతో బ్రిడ్జి కూలిపోయే అవకాశం ఉందని, దీంతో ప్రయాణాలు కొనసాగడం కష్టతరంగా మారుతుంది అని ఆ గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రజా ప్రతినిధులు ప్రత్యేకంగా చొరవ చూపించి, బ్రిడ్జి వద్ద మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Next Story