- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rain Alert : మరో రెండు గంటల్లో భారీ వర్షం
నైరుతి రుతుపవనాల రాక ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : నైరుతి రుతుపవనాల (Southwest Monsoon) రాకకు ముందే తెలంగాణ, ఏపీలో వాతావరణం పూర్తిగా చల్లబడింది. కేరళను తాకిన రుతుపవనాలు వేగంగా ముందుకు కదులుతుండటంతో, దాని ప్రభావం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో ముందస్తు వర్షాలు (Pre-monsoon showers) విస్తారంగా కురుస్తున్నాయి. హైదరాబాద్ వాతావరణ విభాగం(HMD) అందించిన సమాచారం ప్రకారం.. రాబోయే 2 గంటల్లో ముఖ్యంగా దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో వాతావరణం వేగంగా మారిపోయి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జనగామ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నారాయణపేట్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడే సూచనలు ఉన్నాయి. అలాగే ఆదిలాబాద్, నిర్మల్, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, మరియు రంగారెడ్డి జిల్లాలతోపాటు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ సాయంత్రానికి ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉన్నందున ఎల్లో అలర్ట్‌ను జారీ చేశారు.
రుతుపవనాల కదలికలు అనుకూలంగా మారడంతో ఏపీలోని తీరప్రాంతాల్లో కూడా వాతావరణం అనుకూలించింది. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించిన వివరాల ప్రకారం.. రుతుపవనాలు రాయలసీమ మీదుగా రాష్ట్రంలోకి ప్రవేశించే లోపే, కోస్తా ఆంధ్రా జిల్లాల్లో ముందస్తు వర్షాలు ప్రారంభం కానున్నాయి. ముఖ్యంగా ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా తీర ప్రాంతాల్లో అక్కడక్కడా బలమైన గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.






