చింతలపాలెం మండలంలో ప్రీ-ప్రైమరీ పాఠశాలల్లో ఉద్యోగాల భర్తీ

by Kodari Anjali |

ప్రీ-ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్, ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైనట్లు చింతలపాలెం మండల విద్యాధికారి ఎన్. శ్రీనివాస్ తెలిపారు.

చింతలపాలెం మండలంలో ప్రీ-ప్రైమరీ పాఠశాలల్లో ఉద్యోగాల భర్తీ
X

దిశ, చింతలపాలెం: చింతలపాలెం మండల పరిధిలోని యూపీఎస్ వజినేపల్లి, ఎస్సీ కాలనీ దొండపాడు, ఎంపీపీఎస్ చింతలపాలెం పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్, ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైనట్లు మండల విద్యాధికారి ఎన్. శ్రీనివాస్ తెలిపారు. ఈ పోస్టులకు మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులని పేర్కొన్నారు. ప్రీ-ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్ పోస్టుకు ఇంటర్మీడియట్‌తో పాటు ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేషన్ లేదా ప్రైమరీ టీచింగ్‌లో డిప్లొమా అర్హత ఉండాలని, ఆయా పోస్టుకు కనీసం 7వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలని తెలిపారు. ఎంపికైన వారికి ఇన్‌స్ట్రక్టర్ పోస్టుకు నెలకు రూ.8,000, ఆయా పోస్టుకు రూ.6,000 గౌరవ వేతనం అందజేయనున్నట్లు చెప్పారు. దరఖాస్తుల స్వీకరణ జూన్ 6 నుంచి 10 వరకు జరుగుతుందని, ఆసక్తి గల మహిళా అభ్యర్థులు సంబంధిత పాఠశాలలు లేదా మండల విద్యాశాఖ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.

Next Story