పలు నూతన అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే..

by Kodari Anjali |

వరంగల్ ఆఫీసర్స్ క్లబ్‌లో చేపట్టనున్న పలు నూతన అభివృద్ధి పనులను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రారంభించారు.

పలు నూతన అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే..
X

దిశ, హనుమకొండ కలెక్టరేట్: వరంగల్ ఆఫీసర్స్ క్లబ్‌లో చేపట్టనున్న పలు నూతన అభివృద్ధి పనులను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ.. ఆఫీసర్స్ క్లబ్‌ను మరింత ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేసి సభ్యులకు మెరుగైన సేవలు అందించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. క్లబ్ అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ఎల్లప్పుడూ సహకారం అందిస్తామని పేర్కొన్నారు. క్లబ్ అభివృద్ధి పనులు పూర్తయిన అనంతరం సభ్యులకు మరింత సౌకర్యవంతమైన వాతావరణం అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Next Story