క్రాంతి ఆశయాల బాటలో.. ములకలపల్లి ప్రెస్ క్లబ్ నూతన సారథ్యం

by Kodari Anjali |

ములకలపల్లి ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా ముదిగొండ శ్రీనువాసురావు ఘనవిజయం సాధించారు.

క్రాంతి ఆశయాల బాటలో.. ములకలపల్లి ప్రెస్ క్లబ్ నూతన సారథ్యం
X

దిశ, ములకలపల్లి: ములకలపల్లి ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా ముదిగొండ శ్రీనువాసురావు ఘనవిజయం సాధించారు. ఎన్నికల ప్రక్రియకు ముందు జర్నలిస్టులందరూ దివంగత ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షులు పోతుగంటి క్రాంతికి ఘన నివాళులర్పించారు.

క్రాంతికి ఘన నివాళి..

తోటి విలేకరుల పట్ల ఆయన చూపిన ఆత్మీయత, అండగా నిలిచిన తీరును ఈ సందర్భంగా సభ్యులందరూ గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం తీరని లోటని పేర్కొంటూ, రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులర్పించారు. మండలకేంద్రంలో క్రాంతి ఎంతో కష్టపడి నిర్మించిన ప్రెస్ క్లబ్ భవనం, ఆయనకు ఒక శాశ్వత స్మృతిగా నిలుస్తుందని సభ్యులు ఉద్వేగానికి లోనయ్యారు.

జర్నలిస్టులు సంక్షేమానికి కృషి..

అనంతరం జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా ముదిగొండ శ్రీను విజయం సాధించగా, కార్యదర్శిగా ఉదయ్, గౌరవ అధ్యక్షులుగా శేషగిరిరావు, కోశాధికారిగా బషీర్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ముదిగొండ శ్రీను మాట్లాడుతూ, క్రాంతి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రెస్ క్లబ్ భవనంలో బాధ్యతలు స్వీకరించడం గర్వంగా ఉందన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా, తోటి జర్నలిస్టులందరినీ కలుపుకుంటూ ప్రెస్ క్లబ్ అభివృద్ధికి, సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానన్నారు. తనని నమ్మి ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ ఎన్నికలు సీనియర్ జర్నలిస్టులు ఉస్మాన్ ఖాన్, పువ్వాల శ్రీనివాస్, పర్యావేక్షనలో నియమించగా.. స్థానిక జర్నలిస్టులు, ప్రతినిధులు పాల్గొని నూతన అధ్యక్షుడికి అభినందనలు తెలియజేశారు.

Next Story