- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలంటూ వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన
తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ జన్నారం గ్రామపంచాయతీకి చెందిన కట్టెకోల రాములు శుక్రవారం గ్రామపంచాయతీ ఆవరణలోని వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు.

దిశ, జన్నారం :తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ జన్నారం గ్రామపంచాయతీకి చెందిన కట్టెకోల రాములు శుక్రవారం గ్రామపంచాయతీ ఆవరణలోని వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. తాను ఎస్సీ దళిత కుటుంబానికి చెందిన నిరుపేదనని, సొంత నివాస గృహం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని పేర్కొంటూ ప్రభుత్వం తనకు ఇందిరమ్మ గృహ పథకం కింద ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశాడు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని రాములతో మాట్లాడారు. అతని సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రాములు వాటర్ ట్యాంక్‌పై నుంచి క్షేమంగా కిందికి దిగివచ్చాడు. అనంతరం పోలీసులు గ్రామ సర్పంచ్ అజ్మీరా కళావతి నందు నాయక్, గ్రామ కార్యదర్శితో మాట్లాడి రాములు సమస్యపై తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ఘటనతో గ్రామపంచాయతీ పరిసరాల్లో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, పోలీసుల సమయోచిత జోక్యంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. స్థానికులు కూడా బాధితుడి సమస్యను ప్రభుత్వం పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని కోరుతున్నారు.






