కామారెడ్డిలో విషాదం.. ఈతకు వెళ్లి ముగ్గురు మృతి

by Naga Rani Yarlagadda |

మంజీరానదిలో సరదాగా ఈతకొట్టేందుకు వెళ్లగా.. ఆ సరదా తీరని విషాదాన్ని మిగిల్చింది.

కామారెడ్డిలో విషాదం.. ఈతకు వెళ్లి ముగ్గురు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: కామారెడ్డి జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని పిట్లం మండలం బొల్లక్ పల్లి వద్ద మంజీరా నదిలోకి ఈతకు వెళ్లిన నలుగురు గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమివ్వగా ఘటనా స్థలానికి చేరుకుని గత ఈతగాళ్లతో నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైనవారిలో వారిలో ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో.. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మూడు మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టమ్ కు తరలించారు. మృతులంతా కిష్టాపూర్ కు చెందినవారుగా గుర్తించారు. వారికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు మృతుల కుటుంబాలకు సమాచారమివ్వగా.. వారి కుటుంబాలు తీరని శోకసంద్రంలో మునిగిపోయాయి.

Next Story