- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిరుమల కొండపై కొత్త శకం.. ప్రయోగాత్మకంగా ‘శ్రీవారి వైద్య సేవలు’
తిరుమల కొండపై కొత్త శకం ప్రారమైంది. ప్రయోగాత్మకంగా శ్రీవారి వైద్య సేవలను శుక్రవారం షురూ చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీ ఆసుపత్రుల్లో “శ్రీవారి వైద్య సేవ” కార్యక్రమాన్ని శుక్రవారం ప్రయోగాత్మకంగా ప్రారంభించారు

దిశ, వెబ్ డెస్క్: తిరుమల(Tirumala) కొండపై కొత్త శకం ప్రారమైంది. ప్రయోగాత్మకంగా శ్రీవారి వైద్య సేవల(Srivari Medical Services)ను శుక్రవారం షురూ చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) ఆదేశాల మేరకు టీటీడీ ఆసుపత్రుల్లో “శ్రీవారి వైద్య సేవ” కార్యక్రమాన్ని శుక్రవారం ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్య నిపుణుల సేవలను భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు టీటీడీ ఈవో ఎం. రవిచంద్ర(TTD EO M. Ravichandra) స్పష్టం చేశారు. సీఎం సూచనల మేరకు విద్య, వైద్యం, ఐటీ రంగాల్లో సేవా భావంతో వచ్చే నిపుణులకు టీటీడీ ఒక వేదికగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
వైద్యులకు ఉచిత వసతి, భోజన సౌకర్యాలు
ఈ కార్యక్రమం ద్వారా సూపర్ స్పెషాలిటీ వైద్యులు మూడు రోజుల పాటు, ఎంబీబీఎస్ వైద్యులు ఏడు రోజుల పాటు స్వచ్ఛందంగా సేవలందించే అవకాశం ఉందని ఈవో ఎం. రవిచంద్ర తెలిాపరు. ఈ సేవల్లో పాల్గొనే వైద్యులకు తిరుమల, తిరుపతిలలో ఉచిత వసతి, భోజన సౌకర్యాలను టీటీడీ కల్పించనుందని ఆయన చెప్పారు. అశ్విని ఆసుపత్రి, స్విమ్స్, బర్డ్, ఆయుర్వేద ఆసుపత్రి, పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి, ఎస్వీ గోశాల వంటి టీటీడీ అనుబంధ సంస్థల్లో ఈ వైద్య నిపుణులు సేవలందిస్తారని, హిందూ మతానికి చెందిన ఆసక్తిగల వైద్యులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమకు అనుకూలమైన తేదీల్లో ఆన్‌లైన్ స్లాట్ బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ ప్రయోగాత్మక దశ ముగిసిన అనంతరం, పాల్గొన్న వైద్యుల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా ఈ కార్యక్రమాన్ని మరింత మెరుగుపరిచి భవిష్యత్తులో విస్తృత స్థాయిలో అమలు చేయనున్నామని టీటీడీ ఈవో ఎం. రవిచంద్ర తెలిపారు.
వర్చువల్‌గా పాల్గొన్న పలువురు వైద్యులు
కాగా, ఈ ప్రారంభోత్సవంలో హైదరాబాద్, సికింద్రాబాద్, వైజాగ్, బెంగళూరుకు చెందిన పలువురు ప్రముఖ వైద్య నిపుణులు వర్చువల్‌గా పాల్గొని ఈవోతో మాట్లాడారు. శ్రీవారి భక్తులకు సేవలందించే అద్భుతమైన అవకాశాన్ని కల్పించడాన్ని తాము స్వామివారి అనుగ్రహంగా భావిస్తున్నట్లు వారు సంతోషం వ్యక్తం చేశారు.






