ఎంఎంసి భ‌వ‌నానికి శంకుస్థాప‌న‌

by Taduka Kalyani |

మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ నూతన ప్రధాన కార్యాలయ భవన శంకుస్థాపన కార్యక్రమం జూన్ 7న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా నిర్వహించనున్న నేపథ్యంలో, ఎంఎంసీ కమిషనర్ ఏర్పాట్లను పరిశీలించారు.

ఎంఎంసి భ‌వ‌నానికి శంకుస్థాప‌న‌
X

దిశ,మేడ్చల్ బ్యూరో : మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ నూతన ప్రధాన కార్యాలయ భవన శంకుస్థాపన కార్యక్రమం జూన్ 7న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా నిర్వహించనున్న నేపథ్యంలో, ఎంఎంసీ కమిషనర్ విన‌య్ కృష్ణా రెడ్డి ఉప్పల్ భగాయత్‌లోని కార్యక్రమ స్థలాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జోనల్ కమిషనర్లు, విభాగాధిపతులు, ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీస్ , వాటర్ వర్క్స్ శాఖల అధికారులతో కలిసి కార్యక్రమ నిర్వహణకు సంబంధించి చేపడుతున్న ఏర్పాట్లపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. వేదిక నిర్మాణ పనులు, అతిథుల కూర్చొనే ఏర్పాట్లు, పార్కింగ్ సదుపాయాలు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ, విద్యుత్ సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు, ప్రజలకు కల్పించాల్సిన సౌకర్యాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు హాజరుకానున్నందున అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని కమిషనర్ ఆదేశించారు. అలాగే కార్యక్రమానికి హాజరయ్యే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్లు రాధిక గుప్తా, సంచిత్ గంగ్వార్, వికాస్ మహతి, పారిశుద్ధ్య అదనపు కమిషనర్ రఘు ప్రసాద్, పరిపాలన అదనపు కమిషనర్ వేణుగోపాల్, చీఫ్ ఇంజనీర్ అశోక్ రెడ్డి, డైరెక్టర్ యుబిడీ సునంద, ఎస్.ఈ శ్రీనివాస్ రావు, ఈఈ రోహిణి, ఈఈ రమేష్ బాబు, పీడి యూసీడీ సురేష్ కుమార్, వెటర్నరీ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ ఎంటరాలజిస్ట్ మాధవ రెడ్డి మరియు బోడుప్పల్ డిప్యూటీ కమిషనర్ శైలజ గారు మరియు ఇతర సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Next Story