నోరు జారొద్దు.. జనసైనికులకు కీలక సూచన

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-06-05 12:06:36  IST  )

రాష్ట్రంలో ఇటీవల చోటుకున్న పరిణామాల నేపథ్యంలో తెలంగాణ జనసేన పార్టీ అప్రమత్తమైంది. ఆ పార్టీ రాష్ట్ర నాయకులు, అధికార ప్రతినిధులు, జనసైనికులకు ముఖ్యమైన విజ్ఞప్తి చేసింది....

నోరు జారొద్దు.. జనసైనికులకు కీలక సూచన
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఇటీవల చోటుకున్న పరిణామాల నేపథ్యంలో తెలంగాణ జనసేన పార్టీ అప్రమత్తమైంది. ఆ పార్టీ రాష్ట్ర నాయకులు, అధికార ప్రతినిధులు, జనసైనికులకు ముఖ్యమైన విజ్ఞప్తి చేసింది. కొద్ది రోజులుగా తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై సమర్థవంతంగా స్పందిస్తూ, పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేసింది.

భాష, పదజాలం విషయంలో ఆలోచించండి:

అయితే మీడియాతో మాట్లాడేటప్పుడు, అలాగే ఇతర రాజకీయ పార్టీల నాయకుల వ్యాఖ్యలపై స్పందించేటప్పుడు దయచేసి తమరు ఉపయోగించే భాష, పదజాలం విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడాలని స్పష్టం చేసింది. పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎల్లప్పుడూ జనసేన నాయకులు, జనసైనికులు నైతికంగా ఉన్నత ప్రమాణాలు పాటిస్తూ, తమ వైపు ఎటువంటి తప్పు లేకుండా చూసుకోవాలని సూచిస్తుంటారని, అదే స్ఫూర్తితో పార్టీలోని అందరూ మీడియా సమావేశాలు, టీవీ డిబేట్స్, సామాజిక మాధ్యమాల్లో స్పందించే సందర్భాల్లో సంయమనం పాటించాలని తెలంగాణ జనసేన పార్టీ సూచించింది.

తెలంగాణ జనసేన ట్వీట్

Next Story