- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హోంగార్డుల పనితీరుపై ఇంటిలిజెన్సీ ఆరా..
ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో ఆ ఇద్దరు హోంగార్డులు తమ విధుల కంటే సొంత వ్యాపారులపైనే ఎక్కువ దృష్టి పెట్టారు.

దిశ, కారేపల్లి: ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో ఆ ఇద్దరు హోంగార్డులు తమ విధుల కంటే సొంత వ్యాపారులపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. ఒకరు చిట్టిల వ్యాపారంపై మరొకరు మద్యం విక్రయాల వ్యాపారం చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆఇద్దరు హోంగార్డుల పనితీరుపై దిశ దినపత్రికలో వెలువడిన కథనంకు సంబంధిత అధికారులు స్పందించారు. ఆ ఇద్దరు హోంగార్డుల పనితీరుపై ఎస్ బి ఇంటిలిజెన్సీ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. హోంగార్డు నిర్వర్తించాల్సిన విధులు విస్మరించి తమ సొంత స్వలాభం కోసం సొంత వ్యాపారులపై దృష్టి సారించడం కారేపల్లిలో హాట్ టాపిక్‌గా మారింది. ఇది ఇలా ఉండగా.. ఏళ్ల తరబడి ఆ ఇద్దరు హోంగార్డులు స్థానికంగానే హోంగార్డు విధులు నిర్వర్తించడం పట్ల పలు అనుమానాలకు తావిస్తోంది. సంబంధిత శాఖ అధికారులు విచారణ చేపట్టి ఆ ఇద్దరు హోంగార్డుల వ్యవహారంపై ఆధారాలు లభిస్తే చట్ట పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సంబంధిత శాఖకు సంబంధించిన అధికారి దిశకు తెలిపారు.






