సుప్రీం కోర్టు తీర్పును ఫాలో అయ్యాం: డీఎస్సీ భర్తీపై కోన శశిధర్‌ క్లారిటీ

by Vemula.Srinu Prasad |

మెరిట్ లిస్ట్ ప్రకారమే మెగా డీఎస్సీ నియామకాలు జరిగాయని పాఠశాల విద్య కార్యదర్శి కోన శశిధర్‌ అన్నారు. మెగా డీఎస్సీపై వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారంపై ఆయన స్పందించారు....

సుప్రీం కోర్టు తీర్పును ఫాలో అయ్యాం: డీఎస్సీ భర్తీపై  కోన శశిధర్‌ క్లారిటీ
X

దిశ, వెబ్ డెస్క్: మెరిట్ లిస్ట్ ప్రకారమే మెగా డీఎస్సీ నియామకాలు(DSC Recruitments) జరిగాయని పాఠశాల విద్య కార్యదర్శి కోన శశిధర్‌(School Education Secretary Kona Sasidhar) అన్నారు. మెగా డీఎస్సీపై వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారంపై ఆయన స్పందించారు. అమరావతి సచివాలయం(Amaravati Secretariat)లో మాట్లాడుతూ డీఎస్సీ నిర్వహణలో అన్ని నియమాలు పాటించామని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు ఫాలో అయ్యామని, ఆ మేరకే రిజర్వేషన్లు అమలు చేశామని తెలిపారు. అయితే ఈ రిజర్వేషన్ల విధానాన్ని క్రమ పద్ధతిలో అమలు చేశామని శశిధర్ స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వర్టికల్ రిజర్వేషన్ విధానాన్ని పాటించామన్నారు. అన్ని అంశాలపై కమిటీ అధ్యయనం చేస్తోందని, సిఫారసులు వచ్చిన తర్వాత ప్రభుత్వం స్పందిస్తుందని వెల్లడించారు. వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి స్థిరమైన రోస్టర్ పాయింట్ లేదని చెప్పారు. కేటగిరీల వైజుగానే పోస్టులు భర్తీ చేశామని కోన శశిధర్‌ పేర్కొన్నారు.

మెరిట్ లిస్టు ప్రకారమే భర్తీ

మెరిట్ లిస్టు ప్రకారమే భర్తీ జరిగిందని కోన శశిధర్‌ స్పష్టం చేశారు. వర్టికల్, హారిజంటల్ రిజర్వేషన్ల విధానం వల్లే విమర్శలు వస్తున్నాయని, జీవో 77పైనా చాలా విమర్శలు వచ్చాయని తెలిపారు. డీఎస్సీపై ఇటీవల అన్ని వివరాలు ప్రకటించామని చెప్పారు. నిబంధల ప్రకారమే డీఎస్సీలో నిర్వహించామని, వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్ల విధానాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. గతంలోనూ నోటిఫికేషన్ ఇచ్చారని, అప్పుడే ఏ పోస్టు ఎవరికో చెప్పేవారన్నారు. సుప్రీం కోర్టు తీర్పు తర్వాత కొన్ని మార్పులు చేశారన్నారు. ఎంపికైన అభ్యర్థి సరిగా సెలక్ట్ అయ్యారా లేదా అనేది చూడాలని చెప్పారు. మెగా డీఎస్సీని పారదర్శంకంగా నిర్వహించామని పాఠశాల విద్య కార్యదర్శి కోన శశిధర్‌ స్పష్టం చేశారు.

Next Story