- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం పర్యటన ను జయప్రదం చేయాలి
ఈ నెల 7వ తేదీన ఉప్పల్ బగాయత్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని మేడ్చల్–మల్కాజిగిరి డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ పిలుపునిచ్చారు.

దిశ, మేడ్చల్ బ్యూరో: ఈ నెల 7వ తేదీన ఉప్పల్ బగాయత్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని మేడ్చల్–మల్కాజిగిరి డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ పిలుపునిచ్చారు. రూ. 99 కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న మల్కాజిగిరి నగరపాలక సంస్థ నూతన కార్యాలయ భవన నిర్మాణానికి, ఇతర అభివృద్ధి పనులకు సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుందని ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో శుక్రవారం ఉప్పల్ బగాయత్‌లో జరుగుతున్న సభావేదిక, పార్కింగ్, భద్రతా తదితర ఏర్పాట్లను స్థానిక కాంగ్రెస్ నేతలు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడితో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహ యాదవ్,ఉప్పల్ నియోజకవర్గం ఇంచార్జి పరమేశ్వర రెడ్డి ,ఎల్.బీ. నగర్ నేత రామ్మోహన్ గౌడ్,బోడుప్పల్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్, బోడుప్పల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పోగుల నరసింహారెడ్డి,మాజీ కార్పొరేటర్లు బొంతు శ్రీదేవి,పావని రెడ్డి,పాల్గొన్నారు. సభకు వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన సౌకర్యాలు కల్పించాలని నిర్వాహకులకు సూచించారు.
చిత్తశుద్ధితో హామీలు అమలు..
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మల్కాజిగిరి నియోజకవర్గం అభివృద్ధి దిశగా శరవేగంగా అడుగులు వేస్తోందని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తోందని డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ స్పష్టం చేశారు. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలకు కాంగ్రెస్ ప్రభుత్వం సత్వర పరిష్కారం చూపుతోందని, ఎంఎంసీకి అత్యాధునిక భవనం అందుబాటులోకి వస్తే.. ప్రజలకు మరింత మెరుగైన పరిపాలనా సేవలు అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు బోడుప్పల్, పీర్జాదిగూడ, మల్కాజిగిరి ప్రాంతాల ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






