- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సన్న వడ్ల సాగును ప్రోత్సహించాలి : కలెక్టర్ కే హైమావతి
సన్న వడ్లు పండించేందుకు రైతులు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేలా గ్రామ, రైతు సభలలో వారిని ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ కే హైమావతి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.

దిశ, సిద్దిపేట: సన్న వడ్లు పండించేందుకు రైతులు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేలా గ్రామ, రైతు సభలలో వారిని ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ కే హైమావతి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హాలులో జిల్లా వ్యవసాయ శాఖ ఏడీఏ, ఏఓ, ఏఈఓ లతో ఆమె జూమ్ సమావేశం ద్వారా మాట్లాడారు. వ్యవసాయ శాఖలో అమలు చేస్తున్న పలు కార్యక్రమాల పనితీరు గూర్చి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ఏ ఓ పరిధిలోని సీడ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో 50 శాతం సన్న వడ్లు అమ్మే లాగా చూడాలన్నారు. వాణిజ్య పంటలు, చిరు ధాన్యాలు, ఆయిల్ ఫామ్ సాగు వైపు రైతులను ప్రేరేపించాలన్నారు. ఫార్మర్ రిజిస్ట్రీ పూర్తి చేయాలని ఏ ఈ ఓ ల ను ఆదేశించారు. ఫార్మసీ రిజిస్ట్రీ వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పలు పథకాలు రైతులకు అందించొచ్చని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి స్వరూప రాణి తదితరులు పాల్గొన్నారు.






