- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అండమాన్ దీవుల్లో భారీ గ్యాస్ నిల్వలు.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ ప్రకటన
అండమాన్ తూర్పు తీరానికి 15 కిలోమీటర్ల దూరంలోని శ్రీ విజయపురం-3 వద్ద భారీ సహజ వాయువు (గ్యాస్) నిక్షేపాలను కనుగొన్నట్లు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి అధికారికంగా ప్రకటించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: అండమాన్ సముద్రంలో అపారమైన ఇంధన వనరులు వెలుగుచూశాయి. అండమాన్ తూర్పు తీరానికి 15 కిలోమీటర్ల దూరంలోని శ్రీ విజయపురం-3 వద్ద భారీ సహజ వాయువు (గ్యాస్) నిక్షేపాలను కనుగొన్నట్లు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి అధికారికంగా ప్రకటించారు. శుక్రవారం ఆయన ‘ఎక్స్’ వేదికగా ఈ అన్వేషణకు సంబంధించిన వీడియోను పంచుకున్నారు. సముద్రంలో 355 మీటర్ల నీటి లోతులో ఈ నిక్షేపాలను గుర్తించారు. 1,900 మీటర్లకు పైగా లోతులో నిర్వహించిన ప్రాథమిక ఉత్పత్తి పరీక్షల్లో గ్యాస్ ఉనికి స్పష్టమైంది. ప్రస్తుతం ఈ గ్యాస్ నాణ్యత, దాని కెలోరిఫిక్ విలువను అంచనా వేసేందుకు ‘ఆయిల్ ఇండియా లిమిటెడ్’ ముమ్మరంగా శాంప్లింగ్ పనులు నిర్వహిస్తోంది.. అని మంత్రి తెలిపారు.
సముద్ర మంథన్ మిషన్
దేశ ఇంధన నిల్వలను పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు ‘సముద్ర మంథన్ మిషన్’లో భాగంగా రాబోయే రోజుల్లో మరిన్ని లోతైన అన్వేషణలు చేపట్టనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ఈ సరికొత్త ఆవిష్కరణ అండమాన్ సముద్ర బేసిన్‌లో కొనసాగుతున్న అన్వేషణలకు దక్కిన అతిపెద్ద విజయమని, ఇది దేశ ఇంధన సామర్థ్యాన్ని మరింతగా పెంచుతుందని మంత్రి హర్దీప్ సింగ్ పురి హర్షం వ్యక్తం చేశారు.
Congratulations @OilIndiaLimited !An ocean of energy opportunities reinforced in the Andaman Sea! Very happy to report the presence of natural gas in Sri Vijayapuram-3 an exploratory well drilled by Oil India Ltd. 15 km off the east coast of the Andaman Islands at a water… pic.twitter.com/j6QvWqZkFx
— Hardeep Singh Puri (@HardeepSPuri) June 5, 2026






