ప్రకృతి సంపదను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత : డీఎఫ్‌వో బాలమణి

by Taduka Kalyani |

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కొమరం భీం జిల్లా అటవీశాఖ అధికారి (డీఎఫ్‌వో) బాలమణి శుక్రవారం బెజ్జూర్ రేంజ్ కార్యాలయాన్ని సందర్శించారు

ప్రకృతి సంపదను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత : డీఎఫ్‌వో బాలమణి
X

దిశ, బెజ్జూర్ : ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కొమరం భీం జిల్లా అటవీశాఖ అధికారి (డీఎఫ్‌వో) బాలమణి శుక్రవారం బెజ్జూర్ రేంజ్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బెజ్జూర్ రేంజ్ పరిధిలోని ఇందిరగాం బీట్‌లో ఉన్న ప్రసిద్ధ ‘రాముడు-భీముడు’ చెట్లను పరిశీలించి, అక్కడ ఏర్పాటు చేసిన బేస్ క్యాంపులను సందర్శించారు. అనంతరం బెజ్జూర్ రేంజ్ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తన వంతు సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా డీఎఫ్‌వో బాలమణి మాట్లాడుతూ, ప్రకృతి సంపద మన అందరి ఆస్తి అని, అడవులు, చెట్లు, జీవవైవిధ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజలు చురుకుగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాగజ్‌నగర్ ఎఫ్‌డీఓ అప్పయ్య, ఇన్‌చార్జి రేంజ్ అధికారి శ్రావణ్ కుమార్, సెక్షన్ అధికారి సఫియా బేగం, బీట్ అధికారులు సంతోష్, వెంకటేష్, మనోహర్‌తో పాటు అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Next Story