మలేషియాకు కేటీఆర్.. ఘన స్వాగతం పలికిన ఎన్నారైలు

by Naga Rani Yarlagadda |

మలేషియాకు కేటీఆర్.. ఘన స్వాగతం పలికిన ఎన్నారైలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుటుంబ సమేతంగా మలేషియా రాజధాని కౌలాలంపూర్ చేరుకున్నారు. మలేషియా తెలంగాణ అసోసియేషన్ (మైటా), బీఆర్ఎస్ మలేషియా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం కౌలాలంపూర్‌లో నిర్వహించనున్న తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో పాల్గొనేందుకు కేటీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి అక్కడికి వెళ్లారు. కౌలాలంపూర్ విమానాశ్రయానికి చేరుకున్న కేటీఆర్ దంపతులకు, కుటుంబ సభ్యులకు ప్రవాస తెలంగాణ ప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. స్వాగతం పలికిన వారిలో తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు గాదరి కిశోర్‌కుమార్, మైటా అధ్యక్షుడు తిరుపతి, బీఆర్ఎస్ మలేషియా అధ్యక్షుడు మారుతితోపాటు ఇతర ముఖ్య నేతలు, ఎన్నారైలు ఉన్నారు.

Next Story