ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌లో ఉద్యోగాలు..

by Kodari Anjali |   (  Updated:2026-06-05 12:50:27  IST  )

గ్రామీణ ప్రాంత యువతి, యువకుల నుండి ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి తెలిపారు.

ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌లో ఉద్యోగాలు..
X

దిశ, మహబూబాబాద్ టౌన్: డి.ఆర్.డి.ఏ-ఈ.జి.యం.యం మహబూబాబాద్ జిల్లా ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంత యువతి, యువకుల నుండి ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మధుసూధనరాజు నేడు ఒక ప్రకటనలో తెలిపారు. డెవలప్మెంట్ మేనేజర్, టైపిస్ట్, ఆఫిస్ సబ్ ఆర్డినేటర్, విలేజ్ లైఫ్ మిత్రా ఉద్యోగాలకై ఎస్.ఎస్.సి, ఇంటర్, డిగ్రీ అర్హతతో 18 నుండి 45 సంవత్సరాల వయసులోపు యువతీ యువకులకు ఈనెల 10 న ఉదయం 10:30 గంటలకు మహిళ మండల సమాఖ్య కార్యాలయం, అన్నారం క్రాస్ రోడ్, జెడ్పిహెచ్ఎస్ హైస్కూల్ స్కూల్ ప్రక్కన, తొర్రూర్ నందు ముఖా-ముఖీ ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేయబడునని తెలిపారు. కావున అర్హత, ఆసక్తి గల మహబూబాబాద్ జిల్లా గ్రామీణా ప్రాంత నిరుద్యోగ యువతీ, యువకులు తమ బయోడేటా లేదా రెస్యుమ్‌తో పాటు, విద్యార్హత ధ్రువపత్రాల జిరాక్స్ కాపీలతో ఉద్యోగ మేళాకు హాజరు కావలసిందిగా అధికారి తెలిపారు. వివరాల కొరకు జి. గణేష్, జాబ్స్ డిస్ట్రిక్ట్ మేనేజర్. మొబైల్ నెం. 8522054266 సంప్రదించగలరని పేర్కొన్నారు.

Next Story