- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పర్యావరణ పై జెపల్లి గ్రామంలో అవగాహన కార్యక్రమం
పర్యావరణాన్ని కాపాడటం మన అందరి బాధ్యత అనే పిలుపుతో మండల పరిధిలోని జెపల్లి గ్రామంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

దిశ, చారకొండ : పర్యావరణాన్ని కాపాడటం మన అందరి బాధ్యత అనే పిలుపుతో మండల పరిధిలోని జెపల్లి గ్రామంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ అమినా అశోక్ రాథోడ్ మాట్లాడుతూ పర్యావరణం మన జీవితానికి ఆధారం అని, స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన నీరు, పచ్చని చెట్లు మన ఆరోగ్యానికి మరియు భావితరాల భవిష్యత్తుకు ఎంతో అవసరమని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించాలనీ, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలనీ, నీటిని వృథా చేయకుండా ఆదా చేయాలని తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, చెట్లను నరకకుండా పచ్చదనాన్ని పెంచాలి. ఒక్క మొక్క ఎన్నో ప్రాణాలకు ఆధారంఠఠ పర్యావరణాన్ని కాపాడితేనే మన భవిష్యత్తు సురక్షితం గా ఉంటుందన్నాయి. ఈ కార్యక్రమంలో డీఎల్ప గారు, డిప్యూటీ సర్పంచ్ మధు, వార్డ్ సభ్యురాలు జంగమ్మ, మాజీ సర్పంచ్ రవీందర్ రెడ్డి, గ్రామస్తులు శ్రీనివాస్ రావు, గోవర్ధన్ రెడ్డి, జంగయ్య, ఎల్లయ్య, ఆశా వర్కర్ కమల, మహిళా సంఘాల సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.






