- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చెత్త నిర్వహణలో మేటి.. హుస్నాబాద్‌కు రాష్ట్ర పురస్కారం!
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని హుస్నాబాద్ మున్సిపాలిటీ ప్రతిష్టాత్మక రాష్ట్ర స్థాయి అవార్డును దక్కించుకుంది.

దిశ, హుస్నాబాద్: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని హుస్నాబాద్ మున్సిపాలిటీ ప్రతిష్టాత్మక రాష్ట్ర స్థాయి అవార్డును దక్కించుకుంది. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ‘క్లైమేట్ యాక్షన్’ ప్రత్యేక కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందజేశారు. ఘన వ్యర్థాల నిర్వహణ, పట్టణ పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణలో చూపిన అద్భుత ప్రతిభకుగానూ హుస్నాబాద్‌కు “బెస్ట్ మున్సిపాలిటీ ఇన్ వేస్ట్ మేనేజ్‌మెంట్” అవార్డు లభించింది. రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా హుస్నాబాద్ పురపాలక చైర్‌పర్సన్ దండి లక్ష్మీ, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, పర్యావరణ అధికారి రవికుమార్ ఈ అవార్డును అందుకున్నారు. పట్టణంలో చెత్త సేకరణ, ప్రజల్లో అవగాహన పెంచడంలో మున్సిపాలిటీ తీసుకున్న చర్యల వల్లే ఈ గుర్తింపు దక్కిందని అధికారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ పురస్కారం హుస్నాబాద్ పట్టణానికి గర్వకారణమని, భవిష్యత్తులో మరిన్ని పర్యావరణ కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు.






