- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. వేల వాహనాల తనిఖీ, భారీగా సీజ్‌లు!
నగరంలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా గురువారం రాత్రి హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో ‘ఆపరేషన్ కవచ్’ పేరిట ముమ్మర వాహన తనిఖీలు చేపట్టారు.

దిశ, డైనమిక్ బ్యూరో: నగరంలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా గురువారం రాత్రి హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో ‘ఆపరేషన్ కవచ్’ పేరిట ముమ్మర వాహన తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఎక్స్ వేదికగా వివరాలు తెలిపారు. జూబ్లీహిల్స్-వెంకటగిరి, మధురానగర్-కృష్ణకాంత్ పార్క్, బోరబండ-పిలీ దర్గా, సనత్‌నగర్, అమీర్‌పేట్-సత్యం థియేటర్, తదితర ప్రాంతాల్లో స్వయంగా తానే క్షేత్రస్థాయికి వెళ్లి తనిఖీలను పరిశీలించినట్లు తెలిపారు. ఈ ప్రత్యేక డ్రైవ్ లో భాగంగా కమిషనరేట్ వ్యాప్తంగా మేము మొత్తం 12,098 వాహనాలను (8,802 ద్విచక్ర వాహనాలు, 1,693 ఫోర్ వీలర్స్, 1,623 ఆటోలు) తనిఖీ చేశాము. ఇందులో సరిగ్గా లేని నంబర్ ప్లేట్లు గల 1,406 వాహనాలను, అసలు నంబర్ ప్లేట్ లేని 1,132 వాహనాలను, నకిలీ నంబర్ ప్లేట్లతో తిరుగుతున్న 69 వాహనాలను గుర్తించాము. నిబంధనలు ఉల్లంఘించిన మొత్తం 2,149 వాహనాలను (2,046 ద్విచక్ర వాహనాలు, 52 ఫోర్ వీలర్స్, 51 ఆటోలు) స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.
నెంబర్ ప్లేట్ల ట్యాంపరింగ్
నెంబర్ ప్లేట్ల ట్యాంపరింగ్, నకిలీ లేదా అసలు నెంబర్ ప్లేట్లు లేకపోవడాన్ని కేవలం సాధారణ ట్రాఫిక్ ఉల్లంఘనగా మేము పరిగణించ బోమని స్పష్టం చేశారు. ఇది సమాజ భద్రతకు పెను ముప్పుగా మారడంతో పాటు, అమాయకులను ఇబ్బందుల్లోకి నెడుతోంది. అందుకే నిబంధనలు ఉల్లంఘించే వారిపై చీటింగ్, ఫోర్జరీ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో అన్ని రకాల వాహనాలపై ఈ తనిఖీలు కొనసాగుతాయని, వాహనదారులు ఎల్లప్పుడూ సరైన పత్రాలను తమతో ఉంచుకోవాలని సూచించారు. నగర శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలంతా పోలీసులకు సహకరించాలని కోరారు.






