- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు’.. కడియం శ్రీహరికి తాటికొండ రాజయ్య వార్నింగ్
కడియం శ్రీహరి వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య తీవ్రంగా మండిపడుతూ స్పందించారు.

దిశ, ధర్మసాగర్: కడియం శ్రీహరి వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య స్పందించి.. కడియం శ్రీహరి అవకాశవాద రాజకీయాలపై తీవ్రంగా మండిపడ్డారు. మా నాయకుడు కేటీఆర్ పై మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సభ్యత సంస్కారాల గురించి మాట్లాడే నైతికత కడియం శ్రీహరికి లేదని, పెద్ద నాయకులను తిడితే లీడర్ అయిపోతానని చెలరేగిపోతున్నాడని అన్నారు. రేవంత్ రెడ్డిని మా నాయకుడు కేటీఆర్ తెలంగాణ ద్రోహి అని ఎందుకు అనవలసి వచ్చినా, ఏనాడు కూడా తెలంగాణ కోసం ఉద్యమం చేసిన వ్యక్తి కాదు అని అన్నారు. జెండా పట్టిన వ్యక్తి కాదు రెండున్నర సంవత్సరాలలో జై తెలంగాణ అనే పదం కూడా ఆయన నోటి వెంట రాలేదు అని తెలిపారు. తెలంగాణ ఆనవాళ్లు తుడిచి వేసే ప్రయత్నం జరుగుతుందన్నారు.
కేటీఆర్ గురించి మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు...
తెలంగాణ హరితహారం పేరిట కేసీఆర్ మొక్కలు నాటితే కనీసం వాటికి నీళ్లు పోయలేని పరిస్థితి మీది అని గుర్తు చేశారు. దేశంలో అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని, తెలంగాణ నీళ్లు ఆంధ్రకు దోచిపెడుతూ, నిధులు రాహుల్ గాంధీకి కప్పం కడుతున్నాడని తెలిపారు. జై తెలంగాణ అన్న వారిపై పిస్తోలు గురిపెట్టిన వ్యక్తి రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి ద్రోహికాక మరేం అవుతాడని అన్నారు. రేవంత్ రెడ్డి మాదిరిగానే ఇక్కడి ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా బీఆర్ఎస్ నాయకులు కష్టపడి గెలిపిస్తే బిడ్డ భవిష్యత్తు కోసం నియోజకవర్గాన్ని తాకట్టు పెట్టి కాంగ్రెస్ పార్టీలో చేరిన కడియం శ్రీహరి, తండ్రికి తగ్గ తనయుడిగా కేటీఆర్ తెలంగాణ ఉనికి కోసం, తెలంగాణ ఆస్తిత్వం కోసం, తెలంగాణ ఆత్మ గౌరవం కోసం పనిచేస్తున్నాడని అన్నారు. కేటీఆర్ గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని అన్నారు. నీ ఇంటి నిర్మాణం కోసం కేసీఆర్, కేటీఆర్ దగ్గరికి వెళ్లి డబ్బులు అడుక్కుంది మర్చిపోయావా? కడియం అని అన్నారు. నీకు.. నీ కూతురికి టిక్కెట్ కోసం వాళ్లని బతిమాలుకున్నది మరిచిపోయావా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది కడియం శ్రీహరి అని మాజీ ఎమ్మెల్యే టి రాజయ్య హెచ్చరించారు.






